Sunday, October 18, 2009

అదన్నమాట! : అక్టొబెర్ 11-17

1. సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే మీకు ఏమి అర్ధం అవుతుంది అండి? సీఎం ఇంటి ఆఫీసు అని. అందులో ఎవరు ఉంటారు అండి? సీఎం కదా ? కాని మన రాష్ట్రం లో సీఎం క్యాంప్ ఆఫీసు లో జగన్మోహనరెడ్డి గారు అతి దారుణంగా తనను సీఎం చెయ్యడానికి రాజకీయాలు నడుపుతున్నారు. అన్తాగా మోజు ఉంటె, ఆ ఇల్లు ఖాళి చేసి, తన ఇంటికి మారి, అక్కడ నుంచి నడిపించుకోవచు కదా రాజాకీయం, ఇలా ప్రభుత్వ ఇంటి నుంచి నడిపించడం ఎంత వరకు సమంజసం? దానికి తోడు అయన డ్రామా చుడలేకపోతున్నాము. అయన హవా భావాలు, ముఖ కవలిఖలు, అన్ని చిరాకు తెప్పిస్తున్నాయి. పెద్ద పెద్ద యాక్టర్స్ ని తల దన్నె లాగ ఉంది ఈయన యాక్టింగ్! ఈయన వర్గాన్ని కి అయితే అసలు సిగ్గే లేదు, ఇలా వరదలు కొంచం తగ్గు ముఖం పట్టాయో లేదో, మళ్ళి గళం ఎత్తారు - జగన్ సీఎం అని. అసలు వరదలు వచ్చినందుకు అందరి కంటా వీళ్ళే బాధ పడిఉంటారు - నాలుగు రోజులు జగన్ ని పొగడలేకపోయారు కదా పాపం! వరదలు తగ్గాలని అందరికంటే ముందు వీళ్ళే కోరుకున్నారు; ప్రజలు కోసం కాదు, వీళ్ళ స్వార్ధం కోసం!

2. ఆంధ్రుల అభిమాన హాస్య రాజకీయ నటుడు, శ్రీ కేసీఆర్ గారు ఈ వారం టీవీ 9 లో దర్సనం ఇచ్చారు. ఇంత ముందు తాగే వాడిని, డాక్టర్ గారు ఇప్పుడు మానేయమని చెప్పారు, కాబట్టి ఇక మందు జోలి కి వెళ్ళటం లేదు అని సెలవు ఇచ్చారు! అంటే, ఏమిటి అండి ? ఇన్నాళ్ళు మందు మత్తు లో పని చేసినట్ట? ఇన్నాళ్ళు ప్రజా జీవితం లో తప్ప తాగి ప్రవర్తించినట్ట ? ఈయన రాజకీయాల్లో ఉన్ననంత కాలం, మనకి మాత్రం కామెడి కి కొదవ లేదు అని మాత్రం కచ్చితం గా చెప్పగలం!

3. కృష్ణ వంశి గారు కొత్త సినిమా ఒకటి తీసారు. పేరు మహాత్మా. అందులో అసలు గాంధీ ఎవరు అనే భావం వచ్చేటట్టు గా ఒక పాట రాసారు, సిరివెన్నల సీతారామశాస్త్రి గారు. మొదటి లైన్ "ఇందిరమ్మ ఇంటి పేరు కాదు రా గాంధి" . నిజమే కదండీ ? కాని సెన్సార్ బోర్డు మాత్రం ఆ వాక్యాన్ని తీసేయమంది అంట! ఎంత దరిద్రం అండి బాబు మన దేశం లో ఇలాంటి ఆంక్షలు. నిజాలు చెప్పడానికి కూడా భయపడాలి ఇంకా!

4. ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలు ప్రస్తుతానికి కొంచం రెస్ట్ తీసుకుంటున్నాయి. ఎందుకో తెలుసా ? వాళ్ళు చేసే పని ని సాక్షి చేస్తుంది కాబట్టి! నిజం - రాష్ట్ర ప్రభుత్వానికి అతి పెద్ద ప్రతిపక్షం సాక్షి! నెల రోజుల ముందు వరకు కనిపించని ఎన్నో అక్రమాలు, సడ్దన్ గా ఇప్పడు సాక్షి కి కనిపించేస్తున్నాయి. అవకసవాదనికి రాజకీయ నాయకుల కన్నా మించి ఉదాహరణం ఎవరైనా అడిగితె, తప్పకుండ సాక్షి పేరు చెప్పండి. మీకే మొదటి బహుమతి వస్తుంది !

0 comments:

Post a Comment