Saturday, November 21, 2009

అదన్నమాట!: నవంబర్ 15-21


1.యువ నేత జగన్ మోహన్ రెడ్డి గారు పెద్ద హీరో లాగ ముఖ్యమంత్రి రోశయ్య గారిని సూటి గా ఒక ప్రశ్న అడిగారు. వైఎసార్ ఆశయం అయిన తొమ్మిది గంటల విద్యుత్ ఎందుకు ఇవ్వటం లేదు అని. మొన్నామధ్య విడుదల చేసిన జీవో నెంబర్ ఇరవై ని ఉపసంహరించుకుంటే తొమ్మిది గంటల విద్యుత్ సాధ్యమని కూడా సెలవు ఇచ్చారు. దీనికి రోశయ్య గారు ఇచ్చిన సమాధానం - ఈ నిర్ణయం వైఎసార్ తీసుకున్నదే బాబు! దెబ్బకి ఇంకేం మాట్లాడకుండా కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.

2. కాంగ్రెస్స్ ఆశ జ్యోతి, యువ నేత, భావి ప్రధాని శ్రీమాన్ రాహుల్ గాంధి గారు ఈ వారం విజయవాడ పర్యటించారు. ఎప్పట్టి లాగే మీడియా మొత్తం ఉర్రుతలు ఊగింది. నన్ను భావి ప్రధాని గా భావించవద్దని , భవిష్యతు ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేరు కదా అని సెలవు ఇచ్చారు. అయితే, అయన చేఇన ఈ వ్యాఖ్య జగన్ మోహన్ రెడ్డి ని ఉద్దేశించిందని మన మీడియా విచ్చలవిడి గా రాయడం/చూపించడం జరిగింది ! మిగతా విషయాల్లోకి వెళ్తే, రాహుల్ గాంధి గారు తెలివి గా ఏదైనా ఇబ్బంది కరమైన ప్రశ్న వస్తే "అవును, ఈ పరిస్థితి ని బాగు చెయ్యాలి" అని చెప్పి తప్పించేసుకుంటారు. కాని మీడియా మాత్రం ఈ విషయం చూపించాడు !

3. ఈ వారం పర్వతనేని ఉపేంద్ర గారు కన్ను మూశారు. రాజీవ్ గాంధి హాయం లో అతి పెద్ద విపక్ష పార్టి అయిన తెలుగు దేశం పార్టీ కి లోక్ సభ నేత గా ప్రసిద్ది కి ఎక్కిన ఈయన, ఈ మధ్యనే ప్రజా రాజ్యం పార్టీ లో చేరి కీలక పాత్ర ని కూడా పోషించారు.

3 comments:

Arun said...

FYI: Arundhati Roy meets kin of deceased naxals

http://www.hindu.com/2009/11/23/stories/2009112353840400.htm

Sudhir said...

Thanks Arun... am circulating this link around..

Arun said...

Google gadget for Eenadu cartoon:

http://www.google.com/ig/adde?moduleurl=http://rams-gadgets.googlecode.com/svn/trunk/ramesh213/EenaduCartoon1.xml&source=imag

Post a Comment