Sunday, December 20, 2009

అదన్నమాట!: డిసెంబర్ 13-19


అత్యంత విచారకరమైన విషయం ఏమిటి అంటే, ఆంధ్రుల భీమన హాస్య నటుడు శ్రీ కేసీఆర్ గారు మొదలు పెట్టిన సినిమా ఇంక క్లైమాక్ష్ కి చేరుకోలేదు. జోక్స్ పక్కన పెడితే, ఈ తెలంగాణా, సమైక్యాంధ్ర "ఉద్యమాల" పేరుతో బాగా నష్టపోతుంది సామాన్య మానవుడే. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, షాప్లు మూసేస్తునారు, బుసలు ఆపెస్తునారు, రాస్తా రోకోలు నిర్వహిస్తున్నారు, కాలేజిలు ఎలాగో మూసేశారు - జన జీవినం అస్త వ్యస్తం అవ్వడానికి ఇంత కన్నా నిదర్శనం ఏమి కావలి అండి? ఇలా ఎన్నాలు ప్రజల్ని భయ బ్రన్తులకి లోని చేసి, "స్వచంద బంద్" అనే మారు పేరు తో చిన్న వ్యపురులు ఇత్యాది వర్గాలను కష్టాల్లో పెడతారు అండి ఈ రాజకీయ నేతలు ? మధ్య కేసీఆర్ గారు వచ్చి "బెబ్బులి పులి" లాగ తిరిగి వస్తాను అని మళ్ళి ప్రగల్భాలు పలకడం మొదలు పెట్టారు. నోటికి వచ్చినట్టు వాగడం మళ్ళి మొదలుపెట్టారు. కాంగ్రెస్స్ అధిష్టానం ఏమో ఇది అంతా చంద్రబాబు నాయుడు తప్పు అని కొత్త వక్రీకరణ మొదలుపెట్టింది. నాయుడు గారు ఏమో అసలు ఏమి మాట్లాడడం లేదు. ఒకరి మీద ఒకరు విమర్శలను విసురుకోవడమే జరుగుతుంది తప్పించి, అసలు ఈ సమస్య కి పరిష్కారం వెతకడానికి మాత్రం తప్పుడు చేసిన పెద్దలు ప్రయత్నిస్తునట్టు అస్సలు కనిపించటం లేదు.

ముఖ్యమంత్రి గారు ఏమో నాకు ఏమి తెలియదు, అంతా అమ్మ చూసుకుంటుంది అంటారు. డిల్లి లో ఏమి అమ్మ మాట్లాడదు. మధ్యలో ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చి అసలు అసెంబ్లీ లో తీర్మానం ఆమోదం పొందితే కదా ఏదైనా జరిగేది, కాబట్టి ఎందుకు ఇంత రభస చేస్తునారు అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటి ప్రణబ్ గారు - ఎలాగో అసెంబ్లీ లో తీర్మానం వీగిపోతుంది అనే ధీమా తో ఉన్నారా? అసెంబ్లీ లో తీర్మానం వీగిపోతే, అప్పుడు మళ్ళి తెలంగాణా లో గొడవలు మొదలు అవుతాయి కదా.. అప్పుడు ఏమి చేస్తారు మరి?

అసలు ఒక రాష్ట్రాన్ని విభజించే నిర్ణయం కేంద్ర క్యాబినెట్ తీసుకోవాలా? కాంగ్రెస్ కోర్ కమిటి తీసుకోవాలా?? పాటించవలసిన పద్దతులన్నీ తుంగ లో తొక్కి ఇప్పుడు ఏమో నాయుడు గారు అలా అన్నారు. చిరంజీవి గారు ఇలా అన్నారు అని మాకు చెప్పడం ఎందుకు? అన్నట్టు , మర్చిపోయా...చిరంజీవి గారు ఇప్పుడు సమైక్యవాది అంట! ఇలా తన మాట మార్చినందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఎంఎల్యే పదవి కి రాజీనామా కూడా చేసారు. ఇప్పుడు వెళ్లి సీమాంధ్ర లో ఉద్యమాన్ని నడిపిస్తారు అంట. అక్కడ మీరు నడిపించేది ఏమి ఉంది ఉద్యమం?

మొత్తానికి రాజకీయ నాయకుల స్వీయ ప్రయోజనాల కోసం సామాన్య మానవుడు బలి అవుతున్నాడు. కాని ఇది పెద్దగ ఎవరూ పట్టించుకోవటం లేదు. అదన్నమాట!

1 comments:

Arun said...

My hunger-strike is better than yours:

http://www.business-standard.com/india/news/congress-mp-wanted-to-provepoint/380392/

Post a Comment