Sunday, December 6, 2009

అదన్నమాట! : నవెంబర్ 29-డిసెంబర్ 5

ఆంధ్రుల అభిమాన హాస్య నటుడు శ్రీ కేసీఆర్ గారు ఈ వారం ప్రజల్ని తెగ ఇబ్బందుల్లో పడేసారు. ఇబ్బంది అనేది చాలా చిన్న పదం. అయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వాళ్ళ రాష్ట్రం లోని తెలంగాణా జిల్లాల్లో పలు చోట్ల హింస చెలరేగింది. ఆదివారం చేపట్టిన దీఖ్స ను ఆయన సోమవారం రాత్రి కి విరమించారు. ఈ వార్త తెలియగానే విద్యార్ధి సంఘాలు ఊగిపోయాయి. ఇంత స్తే లో వ్యతిరేకత వచ్చేసరికి, కేసీఆర్ గారు మళ్ళి దీక్ష ప్రారంభించారు. అయితే అప్పటికే హింస మార్గం అనుసరించడం మొదలుపెట్టిన కార్యకర్తలు మరియు విద్యార్ధులు మరింత చెలరేగిపోయారు. బుసుల్ల్ని తగలపెట్టారు, షాపుల్ని మూసేశారు, అద్దాలని విరగోట్టారు ... పై పెచ్చు మీడియా కూడా ఈ ఉద్యమంకి మద్దతు చూపుతుంది! దీనిని ఉద్యయం అనడం కన్నా అరాచకం అనడం చాలా సబబు. అసలు కొన్ని అసాంఘిక శక్తులు ఇలా విచ్చల విడి గా ప్రవర్తించినంత మాత్రానా ఒక రాష్ట్రం వచ్చేస్తుంది అని అనుకుంటే, ఇంత కన్నా మూర్ఖత్వం ఏమి ఉంటాదో నాకు అయితే తెలిదు మరి!

ఇది ఇలా ఉండగా, ప్రజా రాజ్యం పార్టీ నుంచి మరో వృద్ధ నేత శ్రీ హరిరామ జోగయ్య గారు రాజీనామా చేసారు ! జై ఆంద్ర ఉద్యమం లో పాల్గొనడానికి రాజీనామా చేసారు అంట! ఏదో ఒకటి లే, మీరు ఉంటె ఎంత లేకపోతె ఎంత లెండి ప్రరపా లో!

నేను నమ్మిన వాళ్ళు మోసం చేసారు అంటూ చిరంజీవి గారు మొన్న ఆ మధ్య వాపోయారు. ఇప్పుడు ఎందుకు లెండి ఇలాంటి డైలాగ్స్ ... మీకు ఉన్న ఆ కొద్ది పాటి మర్యాద కూడా పోతుంది మీ పార్టీ కార్యకర్తలకి !

ఈ వారం కి ఇక్కడితో ఆపెస్తా.. కంప్యుటర్ చాల నెమ్మది గా ఉంది... కష్టం గా ఉంది రాయడానికి...

0 comments:

Post a Comment