Sunday, April 18, 2010

అదన్నమాట! : ఏప్రిల్ 11-17


1 . మంత్రి పదవి ఆసవాహులందరికి నిరాశే మిగిలింది ! ముఖ్య మంత్రి రోశయ్య గారు ఈ వారం రాజధాని కి వెళ్లి మేడం గారి చేత మంత్రి వర్గ విస్తరణకు అనుమతించమని కోరడానికి వెళ్ళరు. మేడం గారు మరి ఎందు చేతనో అనుమతి ఇవ్వలేదు ! దీనితో అయ్యా గారు వెనక్కి వచ్చేసారు మరి! ఇక్కడ ఏమో చాలా మంది ఏం ఎల్ యేలు బాగా ఆసలు పెంచుకున్నారు. ఇక ఇప్పట్లో రోశయ్య గారు ఉన్న మంత్రులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది మరి !

2 . జగనన్న ఈ వారం కూడా తన ఓదార్పు యాత్ర ని కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లా లో పర్యటించారు. సాక్షి టీవీ కి మరే ఇతర వార్తఃలు చూపించే అవసరం కనబడటం లేదు కూడా! ఓదార్పు యాత్ర లో భాగంగా అయన మధ్యలో చిన్న చిన్న సభలని ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నారు. యైఎసార్ లాగ మాట్లాడదాము అని ప్రయత్నిస్తున్నారు. అయన మర్చిపోతుంది ఏంటంటే ఒకరి లాగ మాట్లాడినంత మాత్రాన్న వోట్లు పడవని !

3 . ఆంధ్రుల అభిమాన హాస్య నటుడు శ్రీ కేసీఆర్ గారు ఒక పది మంది తో కలిసి ఈ వారం డిల్లి లో శ్రీ కృష్ణ కమిషన్ ను కలిసారు. కలిసి బయట వచ్చి, వెనకబాటు గురుంచి మేము తెలంగాణా అడగటం లేదు, ఆత్మా గౌరవం గురుంచి అడుగుతున్నాము ! ఇవ్వకపోతే, చాలా దారుణాలు జరుగుతాయి అని హేచ్చారించాము అని చెప్పుకువచ్చారు. అదీ అన్నమాట సంగతి - అయన ఇంకా అదే పదజాలం, అదే దురుస్తనం ప్రద్సిస్తున్నారు. మన దేశం కాబట్టి చెల్లిపోతుంది ఇది అంతా!!

4 . ఎట్టకేలకు సానియా మిర్జా పెళ్లి అయ్యిపోయింది అండి. ఇంకా ఇప్పటికైనా టీవీ వాళ్ళు ఆ గోల ఆపుతారు అన్న ఆనందం ఎక్కువ ఉంది చాలా మందిలో! అదన్నమాట!

0 comments:

Post a Comment