Sunday, April 11, 2010

అదన్నమాట!: ఏప్రిల్ 4-10

ఎట్టకేలకు హైదరాబాద్ పాత బస్తి లో విధించిన కర్ఫ్యూ ని ఎత్తివేశారు. కిందటి వారం లో ఈ అల్లర్లు అంతా ఒక పక్క ప్రణాళిక తో జరిగిన్నాయి అని, దీని వెనక ఎవరిదో చెయ్యి ఉంది అని చాలా మంది చెప్పారు. ఎవరెవరో నిందలు వేసుకున్నారు. కాని ఇప్పుడు మళ్ళి ఆ వ్శాయలు మీద ఎవ్వర్రు మాట్లాడడం లేదు. కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు పరస్పరం నిన్డుచుకున్న రాజకీయ నాయకులు అంతా ఇప్పుడు ఏమి మాట్లాడడం లేదు. అంతే లెండి - మళ్ళి ఇంకో గొడవ అయ్యి సామాన్యుడు బాధ పడే వరకు వీళ్ళు మళ్ళి కనిపించరు కదా!

ఇది ఇలా ఉండగా, మన జగనన్న "ఓదార్పు" అనే ఒక కార్యక్రమంకి నాంది పలికారు. ఈయన గారు దివంగత యైఎసార్ మృతి చెందినా వార్త తెలిసి చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్తారు అంట. మొత్తం 88 ఫ్యమిలిస్ ని కలుస్తారు అంట. మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంట, సాక్షి టీవీ ఈ పర్యటనకి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో.

మన తెలుగు చానల్స్ ఎంత నీచానికి దిగాజరగాలవో ఒక్క సారి సానియా మిర్జా వివాహం మీద వారు ఇస్తున్న వార్తలు చూస్తే అర్ధం అవుతుంది. రోజు రోజుకి చిరాకు వచేస్తుంది వీళ్ళు చూపించే కధనాలను చూస్తుంటే ! ఆమె పెళ్లి ఎప్పుడు అయ్యిపోతుంద అన్న కుతుహులం ఎక్కువ అయ్యిపోయింది మాలో !

0 comments:

Post a Comment