Sunday, June 20, 2010

అదన్నమాట! : జూన్ 13-19

1 . చాల ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏమిటంటే ఈ వారం ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యినా పత్రికల్లో ఫుల్ పేజి ప్రకటనలు రాలేదు. ఎందుకా అని ఆరా తీస్తే, ఎంసెట్ మార్కులకి ఇంటర్ మార్కులు కూడా జోడించి, అప్పుడు ర్యాంకులు వెల్లడిస్తారు అంట! అంత వరకు, వేచి చూడాల్సిందే! అందుకే శ్రీ చైతన్య మరియు నారాయణ వాళ్ళు రెచ్చిపోకుండా, కొంచం సమంవయం పాటిన్చినట్టు ఉన్నారు!

2 . పొన్నాల గారి మీద ఈ వారం సొంత పార్టి వాళ్ళే విరుచుకుపడ్డారు. అవినీతి కి పాలుపడుతున్నారు అని చెప్పారు. ఎప్పటి లాగే విషయం ఢిల్లీ కి వెళ్ళింది. అక్కడ నుంచి ఈ విషయాలు ఏమి మాట్లోడ్డు అని చెప్పారు. ఇక్కడ వీళ్ళు కూడా ఇంకా మేము ఏమి మాట్లాడం అని చెప్పేశారు. ఇంతకి అవినీతి ఆరోపణలు నిజామా కాదా అని మాత్రం ఎవ్వడు పట్టించుకోవడం లేదు !

0 comments:

Post a Comment