Sunday, June 6, 2010

అదన్నమాట!: మే 31 - జూన్ 5

ఈ వారం రాజ్య సభ కి రాష్ట్రం నుంచి పోటి లేకుండా ఆరుగురు ఎన్నికయ్యారు. కాంగ్రెస్స్ నుంచి నలుగురు, తెదేపా నుంచి ఇద్దరు. తెదేపా నుంచి సుజన ఇండస్ట్రీస్ అధినేత సుజన చౌదరి కి టికెట్ ఇవ్వడం పార్టి లో పెద్ద దుమారమే రేపింది. చివరికి చంద్రబాబు నాయుడు తన మాట నెగ్గించుకున్నారు. కాగ, ఆంద్ర జ్యోతి పత్రిక ఈ నిర్ణయాన్ని చాల తప్పు బట్టింది. వాళ్ళ ఛానల్ లో కూడా అర గంట సేపు చంద్రబాబు ని తూర్పారబట్టింది ! పార్టి కోసం ఏమి పని చెయ్యని చౌదరి కి టికెట్ ఎలా ఇస్తారు అని ప్రశ్నించింది. కేవలం పార్టి కోసం డబ్బులు ఇచ్చినంతమాత్రాన టికెట్ ఇచేస్తార అని కూడా అడిగింది . ఒక విధంగా ఆలోచిస్తే అరసుగా రెండు ఎన్నికల్లో ఓడిపోయినా పార్టి కి డబ్బులు ఇస్తున్న వారి గురుంచి కూడా ఆలోచించాలి కదండీ !

జగనన్న ఈ వారం లో డిల్లి వెళ్ళారు. వీరప్ప మోఇలీ గారిని కలిసి బయటికి వచ్చి , తెలంగాణేతర ప్రాంతాలల్లో ఓదార్పు యాత్ర జరపడానికి ఆయన ఒప్పుకునట్టు తెలిపారు. సాయంత్రం అయ్యేసరికి, మోఇలీ గారు పత్రిక మరియు టీవీ విలేకర్ల్ని పిలిచి, నేను అలాంటిది ఏమి చెప్పలేదు అని వివరించారు. దీనితో పార్టి లో జగన్ ఏకాకి అయిపోయారు. వైఎసార్ సతీమణి విజయమ్మ, సోనియా కి ఉత్తరం కూడా రాసారు ... కనీసం ఓదార్పు ద నోచుకోవ ఆ కుటుంబాలు అని ! లేదు విజయమ్మ, అక్కడ మ్యాడం గారు ఏది చెప్తే అదే జరగాలి ఇక్కడ, మీరు ఆ విషయం ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది మరి !

0 comments:

Post a Comment