Sunday, July 18, 2010

అదన్నమాట! : జూలై 11-17

మహారాష్ట్ర ప్రభుత్వం గోదావారి మీద బాబ్లి దగ్గర ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తుంది. దీని వాళ్ళ దిగువ ప్రాంతం లో ఉన్న మన రాష్ట్రానికి నష్టం కలుగుతుంది అని విపక్షాల ఆరోపణ. రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీం కోర్ట్ లో కేసు వేసింది, కోర్ట్ స్టే కూడా ఇచ్చింది. ఆయినా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం కొనసాగిస్తుంది అని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపధ్యం లో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం లో తెదేపా బృందం ఒకటి బాబ్లి ని పరిశీలించడానికి బయల్దేరి వెళ్ళింది. సరిహద్దు దగ్గర బాబ్లి కి తీసుకువేల్తాము అని చెప్పి, మహారాష్ట్ర పోలీసులు ౭౬ మంది తెదేపా నాయకుల్ని అర్రెస్ట్ చేసారు ! తెదేపా నాయకులు ఇప్పుడు భీష్మించుకుని కుర్చునారు. బెయిల్ కూడా తీసుకోవడానికి నిరాకరించారు. ఎన్ని రోజులు ఆయినా అక్కడే ఉంటాము అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద మీడియా లో ఇప్పుడు విపరీతమైన సానుభూతి పెరిగింది ! అర్రెస్ట్ చేసిన నాయకులకి కనీస సౌకర్యాలు కూడా కలిపించటం లేదు అని ఆరోపణల వెల్లు వెత్తాయి ... కొన్ని చానెల్స్ అయితే ఎన్ని ఘంటల ఎన్ని నిమషాలు నాయుడు గారిని అర్రెస్ట్ చేసారో కూడా చుపిస్తునాయి ! ఇద్దరు కార్యకర్తలు ఆత్మా హత్య కూడా చేసుకునారు అని ఇప్పుడు వార్తలు కూడా వస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా, జగన్ గారి ఓదార్పు యాత్ర కొనసాగుతూనే ఉంది. ఎమ్యెల్యేలు కూడా ఈ యాత్ర లో ఇప్పుడు పాలు పంచుకుంటున్నారు. జగన్ గారు ఓదార్పు తక్కువ , ప్రసంగాలు ఎక్కువ చేస్తున్నారు!

0 comments:

Post a Comment