Sunday, January 9, 2011

అదన్నమాట! : జనవరి 2-8

శ్రీ కృష్ణ కమిటీ తన నివేదిక ని సమర్పించింది. 450 పేజీల నివేదక లో అన్ని విషయయాలు కూలంకుషంగా చర్చింది. విద్య, ఆరోగ్యం, ఇరిగేషన్ ప్రాజెక్ట్లు , నీళ్ళు - ఇలా వివిధ రంగాల్లో మూడు ప్రాంతాల్లు ఎలా అభివృధి చెందాయో వివరంగా చెప్పారు. ఆ తరువాత ఈ సమస్య పరిష్కారానికి ఆరు ఆప్షన్స్ సూచించారు. మొదటిది ఎదా తద స్థితి కి కొనసాగించడం. రెండవది రాష్ట్రాన్ని తెలంగాణా, సీమాంధ్ర గ విడగొట్టడం, హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం గ ప్రకటించడం. మూడవది, రాయలసీమ తెలంగాణా కలిపి రాయల తెలంగాణా అనే రాష్ట్రాన్ని ఏర్పరచడం. దీనికి హైదరాబాద్ రాజధాని గ వ్యవహరిస్తుంది. కోస్తా ఆంద్ర ఇంకో రాష్ట్రం. నాలుగవది - తెలంగాణా, సీమాంధ్ర గా విభజించడం, హైదరబా మరియు చుట్టూ పక్కల కొన్ని జిల్లాల్లో మండలాలను కలిపి, కేంద్ర పాలిత ప్రాంతం గ ప్రకటించడం. అయిదవది - తెలంగాణా, సీమాంధ్ర గా విభజించి - హైదరాబాద్ తెలంగాణా కి రాజధాని గా ఉంటుంది. చివరిది - రాష్ట్రాన్ని విభాజించాకుండా, తెలంగాణా కోసం ప్రత్యెక ప్రాంతీయ కౌన్సిల్ ని ఏర్పాటు చెయ్యడం . కమిటి ఈ చివరి ఆప్షన్ వైపే మొగ్గు చూపించింది. దీనితో ప్రత్యెక తెలంగాణా వాదులు నిప్పులు చెరిగారు. బూతులు తిట్టారు. కాని అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటి అంటే, ఒక కాంగ్రెస్స్ నాయకుడు మీడియా ముందికి వచ్చి - సోనియా గాంధి కి కృతఙ్ఞతలు తెలపడం ! ఎలాంటి సందర్భం అయిన మన కాంగ్రెస్స్ వాళ్ళు ఇది చెయ్యడం మరవరు కద! అదన్నమాట!

0 comments:

Post a Comment