Sunday, March 27, 2011

అదన్నమాట! : మార్చి 20-26

ఈ మధ్య ప్రయాణం ఎక్కువ అయ్యి, రాష్ట్ర రాజకీయాలని అంతగా గమనించలేకపోయాను. ఎంఎల్సీ ఎన్నికలు చాల దుమారం లేపాయి . ముందు ఏమో ఎమఎల్యేల కోటా ఎన్నికలు జరిగాయి. జగన్ వర్గం ఎమ్యెల్యేలు కాంగ్రెస్స్ అభ్యర్ది కి వ్యతిరేకంగా వోటు వేసినా, త్రుటి లో ఓటమి నుంచి తప్పించుకున్నారు. ఇది జగన్ కి పెద్ద దెబ్బ అని , ముఖ్యమంత్రి కి పెద్ద విజయం అని కొన్ని పత్రికలు రాసాయి. తరువాత కడప, చిత్తూర్ జిల్లాల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ కోట లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్స్ టిడిపి రెండు కుమ్మక్కు అయ్యి మరి జగన్ ని ఓడించడానికి ప్రయత్నిచారు. కాని అన్యుహ్య రీతి లో జగన్ వర్గం వాళ్ళు మూడు ఎంఎల్సీ సీట్లు గెలుచుకుంది ! దీనితో ఆ కొత్త పార్టి లో ఉత్సాహం పెరిగిపోయింది. ముఖ్యమంత్రి కి పెద్ద దెబ్బ తగిలింది అని మళ్ళి అవే పత్రికలు రాసాయి ! ముఖ్యమంత్రి గారు సోనియా మ్యాడం కి వెళ్లి మొరాయిన్చుకున్నారు కూడా ! మన ముఖ్యమంత్రులకి ఇది అలవాటే కదండీ ... ఏది జరిగిన వెంటనే డిల్లి వెళ్లి మ్యాడం ని ఆర్ధించడం !

0 comments:

Post a Comment