Sunday, January 8, 2012

అదన్నమాట!: జనవరి 1-7


ముందుంది మరింత మంచి కాలం అని మన ముఖ్యమంత్రి గారు ఆ మధ్య సెలవు ఇచ్చారు కదండీ. ఈ వారం పరిశ్రమలకు ఒక వారం ప్రకటించింది ప్రబుత్వం. ఇప్పుడు నెలలో 5 రోజులు పరిశ్రమలకు కరంట్ ఇవ్వటం లేదు. ఇక మీదట నెలలో 12 రోజులు ఇవ్వరు అంట! ఇది ఇలా ఉండగా, కరంట్ చార్జీలు కూడా పెంచుతున్నారు అంట. 

రాష్ట్రంకి ఘులాం నబి ఆజాద్ గారు వచ్చారు. పార్టి కి ప్రభుత్వానికి సమంవయం పెంచడానికి వచ్చారు అంట. ఇది అదును గా తీసుకుని, రాష్ట్ర కాంగ్రెస్స్ నేతలు అంతా ముఖ్యమంత్రి గారి ఏక పక్ష పని తీరు మీద అసహనం వ్యక్త పరిచారు. ఆజాద్ గారు అన్ని విన్నారు.. వెళ్ళిపోయారు! సాక్షాతూ ఉప-ముఖ్యమంత్రి గారు కూడా తన గోడు చెప్పుకునారు అంట. మన సంగతి ఏమో కాని, ముఖ్యమంత్రి గారి "కాలం" మాత్రం అస్సలు బాలేనట్టు గా ఉంది ! 

ఇది ఇలా ఉండగా, స్పీకర్ గారు ఏమో ఇంకా 17 ఎమ్యెల్యేలు మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. త్వరలో తీసుకుంటారు అంట. అదన్నమాట! 

0 comments:

Post a Comment