Sunday, February 19, 2012

అదన్నమాట! ఫిబ్రవరి 12-18


రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొదలు అయ్యాయి అండి. అనుకునట్టు గానే మొదటి మూడు రోజులు సభ ఏమి చర్చికుండానే వాయద పడింది ! తెలుగు దేశం వాళ్ళు ఏమో మద్యం సిందికెట్లు గురుంచి చర్చించాలి అని పట్టు బట్టారు. తెరాస మరియు భాజపా ఏమో తెలంగాణా గురుంచి చర్చించాలి అని పట్టు బట్టారు ! ప్రబుత్వం ఏమో, అన్ని చర్చిద్దాం - కాని తరువాత చర్చిద్దాం అని చెప్తూ వచ్చింది. ఈ నేపద్యం లో సభ వాయద పడింది ! 

అయితే, బొత్స సత్యనారాయణ గారు తెదేపా మీద విరుచుకుపడ్డారు. ఎందుకు ? ఒక్క మద్యం వ్యాపారం గురుంచి మాత్రమె ఎందుకు మాట్లడుతునారు అని !! రైతులు సమస్యలు ప్రతి పక్షానికి పట్టవ అని అడిగారు !!! ఇదేం విడ్డూరం అండి ! సాక్షాతూ పలక పక్షం వాళ్ళు, ఈ ఒక్క సమస్యే ఎందుకు, మిగతా సమస్యులు గురుంచి కూడా అడగండి అని ఎక్కడైనా చెప్తారా అండి ? ఇన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పకనే చెప్పారు కదా! ఇది సరిపోక, ముఖ్యమంత్రి , ప్రతి పక్ష నాయకుడు కుమ్మక్కు అయ్యారు అని కూడా చెప్పారు అంట! ఇది మన రాజకీయాలు - కాంగ్రెస్స్ పార్టీ అధ్యక్షుడు, తన ముఖ్యమంత్రి మరియు ప్రతిపఖ్స నేత కుమ్మకు అయ్యారు అని చెప్పడం ఎప్పుడైనా విన్నారా అండి ? 

ఇది ఇలా ఉండగా, రాష్ట్ర హై కోర్ట్ చంద్రబాబు మీద విజయమ్మ గారు వేసిన కేసు ని కొట్టి పారేసింది ! ఇక తెదేపా శ్రేణుల్లో సంబరాలు ఆరంభం అయ్యాయి ! అదన్నమాట! 

1 comments:

Unknown said...



ارخص نقل عفش بالرياض ارخص نقل عفش بالرياض

نقل عفش بالرياض رخيص

Post a Comment