Sunday, February 12, 2012

అదన్నమాట! ఫిబ్రవరి 5-11


ముఖ్యమంత్రి గారు మళ్ళి తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఖాళి గా ఉన్న మూడు మంత్రి పడవలుని నింపారు. చాలా మంది మంత్రుల  శాఖలలో మార్పులు కూడా చేద్దాం అనుకున్నారు అంట. కాని సోనియా గాంధీ ఒప్పుకోలేదు. బద్గాట్ సమావేశాలు ఇంకో వారం ఉంది అనగా శాఖలు మారిస్తే కష్టం అని మార్చారు అని చెప్పారు. వినడానికి బానే ఉంది ... అయితే ముఖ్యమంత్రి గారు చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి దగ్గర ఉన్న వ్యవసాయం తీసుకుని ఇంకో మంత్రి కి ఇచ్చారు ! వ్యసాయం ఎంత పెద్ద శాఖ అండి? బడ్జెట్ సమావేశాలకి కొత్త మంత్రి సంనిడ్డం అవుతార అండి? అంటే వ్యవసాయం మీద అంతా అలుస ఈ ముఖ్యమంత్రి కి? ఇది ఒక్కటే కాదు అండి - తన ప్రత్యర్ధి డీ ఎల్ రవీంద్ర రెడ్డి దగ్గర ఉన్న శాఖల్లో నుంచి వైద్య విద్య శాఖ తీసేశారు. కొత్త మంత్రులు మరి బడ్జెట్ సమావేశానికి సన్నద్ధం అయ్యిపోతార అండి? శాఖలు మారిస్తే బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాన్ని ఎదురుకోవడం కష్టం అంటారు - అన్న తరువాత వ్యవసాయం, వైద్య విద్య సాఖలని మారుస్తారు ! 

ఇది ఇలా ఉండగా, మరో మంత్రి పేరు మద్యం వ్యాపారుల కుంభకోణం లో బయట పడింది. ఒక వ్యాపారి మంత్రి మోపిదేవి వెంకటరమణ కు పది లక్షల రూపాయలు లంచం ఇచ్చినట్టు ఏసీబీ తన నివేదిక లో పెర్కుంది. అయితే, ఎప్పటి లాగే మంత్రి గారు రాజీనామా కి సిద్దపడ్డారు , ఇతర నాయకులు వద్దు అన్నారు.. అయన మంత్రి గానే కొనసాగుతారు ! 

క్రిందటి వారం ఏమో ఎన్నడు లేని విధంగా ఎనిమిది మంది సమాచార హక్కు కమిశార్న్లను నియమించారు. ఈ వారం , ముఖ్యమంత్రి గారు రాష్ట్రం చరిత్ర లో మొదటి సారి గా, ఆరుగురు విప్లను నియమించారు! అదన్నమాట! 

0 comments:

Post a Comment